మద్యం మత్తులో మహిళపై అత్యాచారయత్నం
- September 14, 2017
మద్యం మత్తులో ఓ వ్యక్తి, బస్ స్టాప్ నుంచి ఓ మహిళను కిందికి లాగేసి, ఓ ట్రక్ వెనకాలకు ఆమెను తీసుకెళ్ళి, ఆమెపై అత్యాచార యత్నం చేసిన కేసులో నిందితుడిపై కేసు నమోదయ్యింది. 24 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఫిలిప్పీన్‌కి చెందిన మహిళను బస్ స్టాప్‌లో గుర్తించాడు. ఎవరూ లేని సమయంలో ఆమెను అక్కడినుంచి తీసుకెళ్ళి ఓ ట్రక్ వెనుక ఆమెపై అత్యాచారానికి యత్నించాడని పోలీసులు తెలిపారు. అటుగా వెళుతున్న నలుగురు వ్యక్తులు బాధితురాలి అరుపులతో అటువైపు వెళ్ళి, నిందితుడ్ని పట్టుకున్నారు. అయితే నిందితుడు తనపై మోపబడ్డ అభియోగాల్ని ఖండిస్తున్నాడు. జులై 12న అల్ కోజ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఏం జరిగిందో తనకు తెలియదని నిందితుడు చెబుతున్నాడు. అయితే నిందితురాలు మాత్రం ఆ సమయంలో తాను చాలా ఆందోళనకు గురయ్యాననీ, సకాలంలో అటువైపుగా వచ్చిన కొందరు తనను రక్షించారని, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన 42 ఏళ్ళ భారతీయుడొకరు, ఆ సమయంలో అటుగా వాహనం నడుపుతున్న తనకు బాధిత మహిళను ఓ వ్యక్తి బలంగా తీసుకెళుతుండడం కన్పించిందనీ, తన కారుని అక్కడికి పోనిచ్చి నిందితుడ్ని పట్టుకున్నానని చెప్పారు. మరో నలుగురు వ్యక్తులు అక్కడికి రావడంతో నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించినా, అతన్ని గట్టిగా పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు ప్రత్యక్ష సాక్షి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









