తెలంగాణ రాష్ట్రంకి రెండు స్వచ్చభారత్ అవార్డులు
- September 14, 2017
పురస్కారాలు అందుకున్న కలెక్టర్లు ఆమ్రపాలి, భారతి
దేశవ్యాప్తంగా 5 జిల్లాలు ఎంపిక.. అందులో మనవే రెండు
'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేస్తున్న తెలంగాణకు రెండు స్వచ్ఛతా అవార్డులు దక్కాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఐదు జిల్లాలకు అవార్డులు దక్కగా అందులో రెండు(వరంగల్, మెదక్) తెలంగాణవే కావటం విశేషం. వీటిని గురువారం కేంద్ర మానవ వనరుల శాఖ ప్రదానం చేసింది. పురస్కారాలను వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి, మెదక్ కలెక్టర్ భారతి హోళికేరి కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ చేతుల మీదుగా అందుకున్నారు. శుభ్రత పాటించడంలో ప్రతిభ చూపిన వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలు, సాంకేతిక ఇనిస్టిట్యూట్లు, ప్రభుత్వ సంస్థలకు స్వచ్ఛతా ర్యాంకులు ఇచ్చారు. వాటిలో సాంకేతిక ఇనిస్టిట్యూట్ విభాగంలో గుంటూరుకు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు దక్కింది. ఈ పురస్కారాన్ని వర్సిటీ డీన్ శరత్‌కుమార్ అందుకున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







