అబుదాబీ 4 రోజులు మాత్రమే: లగ్జరీ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌

- September 14, 2017 , by Maagulf
అబుదాబీ  4 రోజులు మాత్రమే: లగ్జరీ బ్రాండ్స్‌పై 80 శాతం డిస్కౌంట్‌

అబుదాబీ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో కాన్సెప్ట్‌ బిగ్‌ బ్రాండ్స్‌ కార్నివాల్‌ మొదలైంది. ఈ ఎగ్జిబిషన్‌లో లగ్జరీ బ్రాండ్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. నాలుగు రోజులపాటు ఈ కార్నివాల్‌ జరగనుంది. పెర్‌ఫ్యూమ్స్‌, కాస్మొటిక్స్‌, అప్పారెల్స్‌, షూస్‌, హ్యాండ్‌ బ్యాగ్స్‌, సన్‌గ్లాసెస్‌పై ఈ డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉంటాయి. ప్రముఖ బ్రాండ్స్‌ గుస్సి, డుకాటీ, జరా, పోలీస్‌, కాల్విన్‌ క్లీన్‌, లాకాస్ట్‌, క్రాస్‌, జేన్‌ నార్మన్‌, ఫాసిల్‌ సహా పలు బ్రాండ్స్‌ ఈ డిస్కౌంట్‌ కేటగిరీలో పోటీపడ్తున్నాయి. ఫెమినా మిస్‌ ఇండియా ఎర్త్‌ 2012 ప్రాచి మిశ్రా ఈ కార్నివాల్‌ని ప్రారంభిస్తారు. ఆదివారం వరకు జరిగే ఈ షాపింగ్‌ కార్నివాల్‌ సందర్శకులకు, కొనుగోలుదారులకు అత్యద్భుతమైన అనుభూతిని మిగుల్చుతుందని నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com