ఐసిస్ నరమేధం ఇరాక్, సిరియాల్లో నెత్తుటేర్లు 74 మంది మృతి
- September 15, 2017
గత కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ మరోసారి పంజా విసిరింది. ఇరాక్‌లోని దిఖర్ ప్రావిన్స్ పరిధిలోని నసీరియా పట్టణంలోని ఓ రెస్టారెంట్‌పై దాడికి పాల్పడి 74 మందిని పొట్టనబెట్టుకుంది. సాయుధులైన కొందరు ఉగ్రవాదులు రెస్టారెంట్లోకి చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి..అనంతరం అక్కడికి సమీపంలోనే ఉన్న చెక్‌పోస్ట్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు..ఈ మారణకాండలో 74 మంది పౌరులు మరణించగా..మరో 91 మంది గాయపడ్డారు..సమాచారం అందుకున్న భద్రతా దళాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఇస్లాంకు వ్యతిరేకంగా నడుస్తున్న ఇరాక్ తన చర్యలను ఆపకపోతే ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని ఇస్లామిక్ స్టేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







