కేరళ లో తెలంగాణ అయ్యప్పభక్తులకు ప్రత్యేక భవనం

- October 30, 2015 , by Maagulf
కేరళ లో తెలంగాణ అయ్యప్పభక్తులకు ప్రత్యేక భవనం

తెలంగాణ నుంచి వచ్చే అయ్యప్పభక్తుల సౌకర్యార్థం ప్రత్యేక భవనం నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఇచ్చేందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించింది. హైదరాబాద్‌లో నవంబర్‌లో గురుస్వాములతో ప్రత్యేకంగా సదస్సును నిర్వహించేందుకు కూడా ఒప్పుకున్నది. తిరువనంతపురంలో దక్షిణాది రాష్ర్టాల దేవాదాయశాఖ మంత్రుల సమావేశం జరిగింది. రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,దేవాదాయశాఖ సెక్రటరీ శివశంకర్ కూడా పాల్గొని తెలంగాణ భక్తుల వసతి సదుపాయాలపై చర్చించారు. తెలంగాణ వారికి భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా శబరిమలైలో తెలుగు మాట్లాడేవారితో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ వారికోసం ఐదెకరాల స్థలం ఇచ్చేందుకు అంగీకరించిన కేరళ సీఎం ఉమన్‌చాందీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేరళలోని పరిస్థితులు, ఏర్పాట్లపై అవగాహన కోసం హైదరాబాద్‌లో సదస్సును నిర్వహించాలని మంత్రి చేసిన విజ్ఞాపనపై కేరళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. స్థలం కేటాయింపు ఉత్తర్వులు వచ్చిన తరువాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకోనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com