దుబాయ్ ఎయిర్‌పోర్ట్ స్ట్రీట్‌పై కొత్త బ్రిడ్జ్ ప్రారంభం
- September 15, 2017
ఎయిర్‌పోర్ట్ స్ట్రీట్‌పై మర్రాకెష్ స్ట్రీట్ ఇంటర్‌సెక్షన్ వద్ద నిర్మించిన కొత్త బ్రిడ్జ్ ఈ రోజు ప్రారంభమయ్యింది. ఎయిర్‌పోర్ట్ స్ట్రీట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బ్రిడ్జ్‌ని నిర్మించారు. డేరా వైపుగా ఈ రోడ్‌పై ట్రాఫిక్ ఇకపై స్మూత్‌గా సాగనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది. కొత్త బ్రిడ్జ్‌పై వాహనాల రాకపోకలకు అనుమతించిన దరిమిలా వాహనదారులు ఎక్కడికక్కడ రహదారిపై ఏర్పాటు చేసిన సైన్ బోర్డ్స్ ప్రకారం ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇంకా కొన్ని చోట్ల పనులు పెండింగ్‌లో ఉండటంతో ఆయా మార్గాల్లో సూచికలను వాహనదారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు అధికారులు. 2020 నాటికి 92 మిలియన్ ప్యాసింజర్లకు ఎయిర్‌పోర్ట్ కెపాసిటీ చేరుకోనున్న దరిమిలా ఎయిర్‌పోర్ట్ స్ట్రీట్‌పై అభివృద్ధి కార్యక్రమాల్ని అందుకు తగ్గట్టుగా శరవేగంగా పూర్తిచేస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







