అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు యoగ్ హీరో విన్ను 'శేఖరం గారి అబ్బాయి'
- September 15, 2017
ఎం.ఎఫ్ క్రియేషన్స్ పతాకం పై అచ్చివర్స్ సిగ్నేచర్ బ్యానర్ లో హీరోయిన్ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం 'శేఖరం గారి అబ్బాయి'. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. ఇటీవల డా.మోహన్ బాబు లాంచ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చక్కని స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ని ప్రముఖ దర్శకులు శ్రీవాస్ ఆవిష్కరించారు.
విన్ను మద్దిపాటి ఈ చిత్రంతో కథానాయకుడుగా తెరంగేట్రం చేసారు, కథానాయిక అక్షత దర్శకురాలిగా వ్యవహరించడం ఓ విశేషం. సరైన ప్లానింగ్‌తో బడ్జెట్ కథకు తగిన విధంగా దర్శకురాలు అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా వైవిధ్యమైన కథనంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా రూపొందింది. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబరు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నరు. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సాయి యెలేందర్, కెమెరా:రాఘవ, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాతలు:మద్దిపాటి సోమశేఖరరావు, మధుఫోమ్రా, దర్శకత్వం:అక్షత.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







