యూ. ఏ. ఈ. లో క్రెడిట్ కార్డుల ఆఫర్లను పొందలేకపోతున్న 76 శాతం వినియోగదారులు

- October 30, 2015 , by Maagulf
యూ. ఏ. ఈ. లో క్రెడిట్ కార్డుల  ఆఫర్లను పొందలేకపోతున్న 76 శాతం వినియోగదారులు

 

యూ. ఏ. ఈ.  లో బాంకులు క్రెడిట్ కార్డ్ వినియోగదారులను ఆకర్షించడానికి ఉచిత విమాన ప్రయాణాల నుండి ఫుట్ బాల్ టికెట్ల వరకు అనేక ఆకర్షణీయ ఆఫర్లను ఇస్తున్నప్పటికీ, కొమ్పరిట్ ఫర్ మీ గ్రూపు వారి సర్వే ప్రకారం 76 శాతం మందికి పైగా వేలాది దిర్హాం ల విలువగల ఆ ఉచిత లాభాలను పొందలేకపోతున్నారు. అవగాహనా లోపం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వలన క్రెడిట్ కార్డులకై ప్రతి సంవత్సరం ఫీజు చెల్లిస్తూ, మళ్లీ అందుబాటులో ఉన్న రివార్డులను ఉపయోగించుకోలేక రెండు విధాల నష్టపోతున్నారు. 5.9 మిలియన్ల డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు దేశంలో చలామణి లో ఉండగా, వారికి అందుబాటులో ఉన్న అన్ని ఆర్ధిక అవకాశాలను పోల్చిచుసుకుని, తమ వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన వాటిని ఎంపిక చేసుకొనేలా వారి అవగాహన పెంచడానికి కొమ్పరిట్ ఫర్ మీ సంస్థ యొచి స్తోంది. కాగా, ఎమిరేట్స్ ఎన్. బి. డి. వారు క్కూడా, క్రెడిట్ కార్డుల ద్వారా వాడబడే మొత్తాల 17 శాతాన్ని హోటల్ మరియు డైనింగ్ కు, 13 శాతాన్ని పర్యటనలకు వినియోగిస్తున్నారని, ప్రజల అవగాహన పెరగడం వలన ఈ సంఖ్యలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయని వారు విశ్లేషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com