మార్కెట్లో దూసుకెళ్తున్న ఇఇఎస్‌ఎల్
- September 16, 2017
విద్యుత్‌ను పొదుపు చేసే నాణ్యమైన ఎలక్ట్రిక్ ఉపకరణాలను అత్యంత చౌకధరలకే ప్రజలకు అందజేస్తూ సర్వత్రా విశేష మన్ననలను పొందుతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇఇఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) ఇప్పుడు మలేషియా మార్కెట్‌లో ప్రవేశించింది. దీంతో ఇఇఎస్‌ఎల్.. విద్యుత్‌ను ఆదా చేయడంలో ఎంతో సమర్ధవంతమైనవిగా పేరు పొందిన తమ ఎల్‌ఇడి బల్బులను మలేషియాలోని మెలాకా రాష్ట్రంలో అమ్మనుంది. గతంలో ఇఇఎస్‌ఎల్ బ్రిటన్‌లో చేపట్టిన ఇదేవిధమైన పథకం విజయవంతమవడంతో మెలాకా ముఖ్యమంత్రి దతుక్ సెరి ఉతమా ఇర్ హిజ్ ఇద్రిస్ బిన్ హిజ్ హరోన్ తమ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద మెలాకా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ 9 వాట్ల సామర్ధ్యం కలిగిన అత్యంత నాణ్యమైన 10 ఎల్‌ఇడి బల్బులను కేవలం 10 రింగిట్‌ల (మలేషియా కరెన్సీ) ప్రత్యేక ధరకే అందజేయనున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ బల్బులను అమ్ముతున్న ధరతో పోలిస్తే ఇది దాదాపు సగం ధర మాత్రమే. ప్రస్తుతం మెలాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగిస్తున్న 18 వాట్ల సిఎఫ్‌ఎల్ బల్బులను తొలగించి, వాటి స్థానంలో 9 వాట్ల సామర్ధ్యం కలిగివున్న ఎల్‌ఇడి బల్బులను దాదాపు 10 లక్షల మేరకు పంపిణీ చేయాలని ఇఇఎస్‌ఎల్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి మెలాకా రాష్ట్రంలో లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న గ్రీన్ గ్రోత్ ఏషియా అనే సంస్థ తగిన సహాయ, సహకారాలను అందజేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో ప్రస్తుతం ఒక్కో ఎల్‌ఇడి బల్బు సగటు ధర 3 నుంచి 5 డాలర్ల మేరకు ఉంది. దీనితో పోలిస్తే ఇఇఎస్‌ఎల్ అమ్ముతున్న ఎల్‌ఇడి బల్బుల ధర చాలా తక్కువ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







