శ్వేత సౌధంలో 11 ఏళ్ళ బాలుడు, షాక్‌కు గురైన అమెరికా అధ్యక్షుడు
- September 17, 2017
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివసిస్తున్న శ్వేత సౌధంలోకి 11 ఏళ్ళ బాలుడు అడుగుపెట్టాడు. ట్రంప్‌తో కలిసి ఆ బాలుడు ముచ్చటించారు. ట్రంప్‌కు వీరాభిమానిగా ఉన్న ఆ బాలుడి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వాషింగ్టన్ సబర్బ్‌కు చెందిన పదకొండేళ్ళ ఫ్రాంక్ ఎఫ్ఎక్స్ జైక్సియా అనే 11 బాలుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాశారు. ఒకరోజు శ్వేత సౌధంలో గడ్డి కత్తిరంచే పని చేయాలని ఉందన్నారు. ఈ పనిచేస్తే తనకు గౌరవంగా ఉంటుందని గత ఆగష్టులో ట్రంప్‌కు లేఖ రాశారు.
అయితే ఫ్రాంక్ లేఖకు స్పందించిన అధ్యక్ష భవనం పరిపాన సెక్రటరీ షారా సండెర్ అవకాశమిచ్చారు. దీంతో ఫ్రాంక్ శ్వేతసౌధంలోని రోస్‌గార్డెన్ లాన్‌లో మిషన్‌తో గడ్డి కత్తిరించాడు. సాధారణంగా లాన్‌లో గడ్డి కత్తిరించేందుకు 8 డాలర్లను తీసుకొంటారు. కానీ, ఈ డబ్బును కూడ తీసుకొనేందుకు ఆ బాలుడు ఇష్టపడలేదు. ఉచితంగానే పనిచేయడాన్ని గౌరవంగా భావిస్తానని ఆ బాలుడు చెప్పారు.
ట్రంప్ ఆ బాలుడితో కొద్దిసేపు మాట్లాడారు. యూఎస్ నేవీలో పనిచేయాలని ఉందని ఫ్రాంక్ .. ట్రంప్‌కు చెప్పారు. దేశ భవిష్యతం ఇక్కడే ఉందంటూ మనం చాలా అదృష్టవంతులం అంటూ ట్రంప్ మెచ్చుకొన్నారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









