నటి విజయశాంతికి ఆస్తుల విక్రయం కేసులో హైకోర్టు నోటీసులు
- September 17, 2017
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతికి ఆస్తుల విక్రయం కేసులో మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెన్నై, ఎగ్మూర్‌లోని స్థిరాస్తుల విక్రయానికి సంబంధించి ఇందర్‌చంద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎగ్మూర్‌లో విజయశాంతికి చెందిన స్థిరాస్తులను 2006లో తాను రూ.5.20 కోట్లకు కొనుగోలు చేశానని, అందుకు పవర్ ఆఫ్ అటార్నీ పత్రాలను పొంది రూ.4.68 కోట్లు అందించినట్లు తెలిపారు. కానీ అదే ఆస్తులను విజయశాంతి వేరొకరికి విక్రయించారని పేర్కొన్నారు.
దీంతో విజయశాంతిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా స్థానిక జార్జ్ టౌన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ఆ కోర్టు కొట్టివేసింది. దీంతో ఇందర్‌చంద్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌ను శనివారం విచారణకు స్వీకరించారు. ఈ వివాదాన్ని సామరస్యంగా చర్చించి పరిష్కరించుకోవాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఆ రోజు విజయశాంతి స్వయంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీచేశారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







