ఐఎస్టీ ఏఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక

- September 17, 2017 , by Maagulf
ఐఎస్టీ ఏఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌కు హైదరాబాద్ వేదిక

హైదరాబాద్‌ మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదికకానుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నవంబర్‌ 2 నుంచి 5వ తేదీ వరకు ఐఎస్టీ ఏఎఫ్‌ వరల్డ్‌ కప్‌ ఇంటర్‌ రెగు సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ టోర్నీ నిర్వహణపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్‌ చైర్మన్‌ చాంబర్‌లో ఆదివారం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడామంత్రి టి.పద్మారావు చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి ఆర్గనైజింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. ఈ చాంపియన్‌షి్‌ ప్‌లో 20 దేశాలు పోటీపడనున్నాయి. ఆతిథ్య భారతతో పాటు జపాన్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, బంగ్లాదేశ్‌, సింగపూర్‌, శ్రీలంక, దక్షిణకొరియా, చైనా, పాకిస్థాన్‌, నేపాల్‌, మయన్మార్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, వియత్నాం, కంబోడియా, చైనీస్‌ తైపీ, ఇరాన్‌ తదితర దేశాలు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. ఈ జట్లకు హైటెక్‌ సిటీలోని హావాస్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేయనున్నారు. టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ కల్చరల్‌ కమిటీ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com