అక్టోబర్ నుంచి ఆన్లైనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్
- September 18, 2017
అక్టోబర్ 1 నుంచి షార్జా మోటరిస్టులు ఆన్లైన్ ద్వారానే డ్రైవింగ్ లైసెన్సుల్ని రెన్యువల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంటీరియర్ మినిస్ట్రీ రూపొందించిన యాప్ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎమిరేట్ పోలీస్, ఎట్టి పరిస్థితుల్లోనై లైసెన్స్ రెనేఉ్యవల్కి సంబంధించి ఓవర్ ది కౌంటర్ రిక్వెస్ట్‌లను స్వీకరించరు. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్ నుంచి మినిస్ట్రీ యాప్‌ని మోటరిస్టులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోగొట్టుకున్న, దొంగిలించబడ్డ డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా ఈ యాప్ ద్వారానే చేయవచ్చు. షార్జా పోలీస్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ అలి అబు అల్ జౌద్ మాట్లాడుతూ, స్మార్ట్ డివైజెస్ కారణంగా ఎంతో సమయం కలసి వస్తుందనీ, వృధా సమయాన్ని ఈ స్మార్ట్ పద్ధతి ద్వారా నివారించగలుగుతున్నామని అన్నారు. హై క్వాలిటీ సర్వీస్‌లను అందించడానికి స్మార్ట్ విధానం ఉపకరిస్తుందని చెప్పారాయన. ఆన్ లైన్ ద్వారా ట్రాన్జాక్షన్స్ పూర్తయితే, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎలక్ట్రానికల్ మెథడ్‌లో వినియోగదారుడి మొబైల్‌కి చేరుతుంది. అసలు లైసెన్స్ అప్లికెంట్‌కి అందేవరకూ ఈ ఎలక్ట్రానిక్ కార్డ్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









