యూఏఈ తొలి స్మార్ట్ పోలీస్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
- September 18, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్‌లో స్మార్ట్ పోలీస్ సర్వీస్ సెంటర్‌ని ప్రారంభించారు. ప్రపంచంలోనే ఈ స్థాయి సర్వీస్ సెంటర్ ఇదేనని ఆయన కొనియాడారు. ఇలాంటి సర్వీస్ సెంటర్స్‌ని మరిన్ని నెలకొల్పాల్సిందిగా దుబాయ్ పోలీస్‌కి షేక్ మొహమ్మద్ సూచనలు చేశారు. ప్రపంచంలోనే మేటి స్మార్ట్ సర్వీసుల్ని అందించేలా పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు రావడం ఆనందంగా ఉందని చెప్పారాయన. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి మాట్లాడుతూ, రోజులో 24 గంటలూ ఈ సర్వీస్ సెంటర్ పనిచేస్తుందనీ, 33 ఫుల్లీ ఆటోమేటెడ్ సబ్ సర్వీస్‌లకు ఇది అదనమని అన్నారు. పోలీస్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ - దుబాయ్ డిప్యూటీ ఛైర్మన్ లెఫ్టినెంట్ జనరల్ దహి ఖల్ఫాన్ తమీమ్ పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







