సెన్సార్ పూర్తి చేసుకున్నమహేష్ 'స్పైడర్'
- September 18, 2017
ఎల్‌ఎల్‌పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పైడర్'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని సింగిల్ కట్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని దసరా కానుగా సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్ జయరాజ్ సారధ్యంలో రూపొందిన ఈ ఆడియో ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్ అయింది. సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందిన 'స్పైడర్' ట్రైలర్ ఇటీవల రిలీజై హల్చల్ చేసింది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో, భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం సూపర్‌స్టార్ మహేష్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు దర్శకనిర్మాతలు.
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







