'2 ఫ్రెండ్స్' షూటింగ్ పూర్తి
- September 18, 2017
ప్రేమ గొప్పదా లేక స్నేహమా అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రం '2 ఫ్రెండ్స్' (ట్రూ లవ్). నేడు యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువతకు భవిష్యత్తు నిర్దేశం అవుతుంది. ప్రేమకంటే స్నేహం గొప్పదనే కాన్సెప్ట్‌తో రూపొందింది. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నఈ చిత్రానికి జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ముళ్ళగూరు లక్ష్మీదేవి సమర్పణలో అనంతలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం నాలుగు షెడ్యూల్ లో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇందులో సూరజ్ హీరోగా నటిస్తుండగా రవీంద్రతేజ, సానియా, స్నిగ్ద, కార్తీక్, సారా, ధన్ రాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, వై.విజయ, శ్రీలక్ష్మి ఇతర పాత్రధారులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







