మారియా రూపంలో మరో ముప్పు కరీబియన్ దీవులకు

- September 18, 2017 , by Maagulf
మారియా రూపంలో మరో ముప్పు కరీబియన్ దీవులకు

కరీబియన్‌ దీవులు, అమెరికాపై హారికేన్ల దండయాత్ర కొనసాగుతోంది. హార్వీ బీభత్సం సృష్టించింది... ఇర్మా ఊడ్చేసింది... ఇప్పుడు మారియా విధ్వంసానికి సిద్ధమయ్యింది. కరీబియన్‌ దీవులతో పాటు యూఎస్‌పై విరుచుకుపడేందుకు జెట్‌ స్పీడ్‌తో వచ్చేస్తోంది. సాధారణ తుఫానుగా మొదలైన మారియా... క్రమంగా బలపడుతూ హరికేన్‌-5 స్థాయికి చేరింది. మరికొన్ని గంటల్లోనే కరీబియన్‌ దీవులపై విరుచుకుపడుతుందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముందస్తుగా దీవుల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. 

ఈ మారియా హరికేన్‌ డొమినికా దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. లీవార్డ్‌, మార్టినిక్‌ , పోర్టారికో, యూఎస్‌, బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌పై మారియి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమెరికాలోని డొమినాక, సెయింట్స్‌ కిట్స్‌, నెవిస్‌కు ఎఫెక్ట్‌ ఉంటుందటున్నారు. ముందస్తు జాగ్రత్తంగా లక్షలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హరికేన్‌ ఎఫెక్ట్‌ ఉండటంతో ప్రజలంతా ఆహార పథార్థాలను నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాలవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ టీమ్‌లు సిద్ధమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com