లండన్ నుంచి అదిరిపోయే వ్యూహంతో వస్తున్న జగన్
- September 19, 2017
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి పెద్ద కూతురు వర్షారెడ్డిని ప్రతిష్టాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటిక్స్ యూనివర్సిటీలో చేర్పించేందుకు వెళ్లారు. ఈనెల 11న అక్కడకు వెళ్లిన జగన్..19న తిరిగి రావాల్సి ఉంది. కానీ జగన్ ఇండియాకు వచ్చేందుకు తటపటాయిస్తున్నారట. అందుకే తన టూర్ ను పొడిగించుకున్నారని తెలుస్తోంది. కాకినాడ, నంద్యాల ఎన్నికలు తరువాత కార్యకర్తల్లోనే కాదు.. జగన్ లోను నిరుత్సాహం నెలకుంది. మరో నెల రోజుల్లో పాదయాత్ర ఉంది. దీంతో కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. జగన్ ఏకంగా 13 రోజుల టూర్ లో ఉండటంతో ఆ పార్టీ నేతలు కాస్త కామ్ గానే ఉన్నారు. కోర్టు అనుమతితోనే జగన్ విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ మరొక రోజు ఉండాలన్నా తిరిగి కోర్టు అనుమతి తీసుకోవాలి. మరి ఈనెల 21 వరకు జగన్ అక్కడే ఉంటున్న నేపధ్యంలో జగన్ కోర్టు అనుమతి తీసుకున్నారా లేదా అనే చర్చ జరుగుతోంది. తన కూతురుని కాలేజీలో జాయిన్ చెయ్యటానికి వెళ్ళాడు కాబట్టి, పర్సనల్ విషయం అని తెలుగుదేశం పార్టీ పెద్దగా రాజకీయం చెయ్యలేదు. కానీ ఐదు రోజులు అనుకున్న టూర్, 13 రోజులు కావటంతో ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో చర్చ మొదలైంది.
తమ వ్యాపార లావాదేవీలను చక్క పెట్టుకునేందుకు జగన్ టూర్ ను ఉపయోగిస్తున్నాడనే విమర్శలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. జగన్ తన కూతురు ఉండటానికి లండన్ లో ఒక పెద్ద విల్లా కొన్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ టూర్ మీద నిఘా పెట్టి సిబిఐ కచ్చితమైన సమాచారం రాబట్టాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు.
తాజా వార్తలు
- భారత్–ఖతార్ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- పోలీసింగ్‌లో నాయకత్వం ఎంతో కీలకం: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్
- సిరిసిల్లలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: సీఎం రేవంత్
- గ్రీన్ ఎనర్జీ కోసం కేంద్రం కొత్త పథకం
- షార్జాలో 58వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షో ప్రారంభం
- దుబాయ్‌లో తొలి ఎతిహాద్ రైల్ స్టేషన్ ప్రారంభం
- హైదరాబాద్ విమానాశ్రయంలో DRI భారీ ఆపరేషన్
- అక్టోబర్ 2 నుంచి ‘సేవ్ డెమొక్రసీ మార్చ్’.. ఇండియా కూటమి కీలక నిర్ణయం
- నమో భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- దీపావళి టపాసుల పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు







