కువైట్‌లో భారతీయ మహిళ సమయస్ఫూర్తి

- September 19, 2017 , by Maagulf
కువైట్‌లో భారతీయ మహిళ సమయస్ఫూర్తి

కువైట్: ముసుగు దొంగకె ముచ్చెమటలు పట్టించిందా ఆ భారతీయ మహిళ ..విపత్తు సమయంలో వివేకంగా స్పందించిన తీరుకి కువైట్ ప్రభుత్వం ఆ మహిళను అభినందించింది. స్థానిక పత్రికలలో వచ్చిన కధనం ప్రకారం ఆదివారం మహబూలా అనే వ్యాపార సంస్థలోకి ఒక ఆగంతకుడు సాధారణ వ్యక్తి మాదిరిగా ఏదో కొనుగోలు చేసే నెపంతో లోపలకి వచ్చేడు. వారితో కొద్దిసేపు మాట్లాడిన నటించిన ఆ వ్యక్తి  ఒక్కసారిగా తన ముఖం కనిపించకుండా ముసుగు  తగిలించుకొని దొంగ మాదిరిగా మారిపోయాడు.. ఆ సమయంలో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఆ సంస్థలో  ఉన్నారు. తన వెంట తెచ్చుకున్నతుపాకీని వారిపై గురిపెట్టాడు. డబ్బులిమ్మని డిమాండ్ చేశాడు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన ఉద్యోగులు నోట మాట రాక నిలబడిపోయారు.ముగ్గురు ఉద్యోగుల్లో ఒక భారతీయ మహిళ కాగా, మిగతా ఇద్దరు ఈజిప్టు దేశానికి చెందిన పురుషులున్నారు. ఆ వ్యక్తికి డబ్బులిచ్చేందుకని భారతీయ మహిళ టేబుల్ డెస్కులో చూస్తున్నట్లుగా నటించింది. వెంటనే ఫైర్ అలారమ్ నొక్కింది. సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకుంటూ లోపలికొచ్చేసరికి ఆ వ్యక్తి పారిపోయాడు. భారతీయ మహిళ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను పోలీసులకు అందించారు. పోలీసులు భారతీయ మహిళ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రభుత్వాధికారులు కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com