కువైట్‌లో భారతీయ మహిళ సమయస్ఫూర్తి
- September 19, 2017
కువైట్: ముసుగు దొంగకె ముచ్చెమటలు పట్టించిందా ఆ భారతీయ మహిళ ..విపత్తు సమయంలో వివేకంగా స్పందించిన తీరుకి కువైట్ ప్రభుత్వం ఆ మహిళను అభినందించింది. స్థానిక పత్రికలలో వచ్చిన కధనం ప్రకారం ఆదివారం మహబూలా అనే వ్యాపార సంస్థలోకి ఒక ఆగంతకుడు సాధారణ వ్యక్తి మాదిరిగా ఏదో కొనుగోలు చేసే నెపంతో లోపలకి వచ్చేడు. వారితో కొద్దిసేపు మాట్లాడిన నటించిన ఆ వ్యక్తి ఒక్కసారిగా తన ముఖం కనిపించకుండా ముసుగు తగిలించుకొని దొంగ మాదిరిగా మారిపోయాడు.. ఆ సమయంలో ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఆ సంస్థలో ఉన్నారు. తన వెంట తెచ్చుకున్నతుపాకీని వారిపై గురిపెట్టాడు. డబ్బులిమ్మని డిమాండ్ చేశాడు. ఈ పరిణామాన్ని ఊహించలేకపోయిన ఉద్యోగులు నోట మాట రాక నిలబడిపోయారు.ముగ్గురు ఉద్యోగుల్లో ఒక భారతీయ మహిళ కాగా, మిగతా ఇద్దరు ఈజిప్టు దేశానికి చెందిన పురుషులున్నారు. ఆ వ్యక్తికి డబ్బులిచ్చేందుకని భారతీయ మహిళ టేబుల్ డెస్కులో చూస్తున్నట్లుగా నటించింది. వెంటనే ఫైర్ అలారమ్ నొక్కింది. సెక్యూరిటీ సిబ్బంది పరుగెత్తుకుంటూ లోపలికొచ్చేసరికి ఆ వ్యక్తి పారిపోయాడు. భారతీయ మహిళ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను పోలీసులకు అందించారు. పోలీసులు భారతీయ మహిళ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రభుత్వాధికారులు కూడా ఆమె చేసిన పనిని అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







