ఫేక్‌ గోల్ట్‌ ట్రేడర్స్‌ గుట్టు రట్టు

- September 19, 2017 , by Maagulf
ఫేక్‌ గోల్ట్‌ ట్రేడర్స్‌ గుట్టు రట్టు

అబుదాబీ: అబుదాబీ పోలీసులు, 27 ఇలోల ఫేక్‌ గోల్డ్‌ జ్యుయెలరీని లోకల్‌ మార్కెట్‌ నుంచి స్వాధీనం చేసుకున్నారు. నకిలీ అంతర్జాతీయ ట్రేడ్‌ మార్కెట్‌తో ఈ జ్యుయెలరీని రూపొందించారని పోలీసులు చెప్పారు. మొత్తం 26 జ్యుయెలరీ షోరూమ్‌లు ఈ కమర్షియల్‌ ఫ్రాడ్‌లో భాగం పంచుకున్నాయని వారు వివరించారు. వీటిల్లో 11 ఔట్‌లెట్స్‌ ఒకే వ్యక్తికి చెందినవి. అయితే ఆ వ్యక్తికి సంబంధించిన వివరాల్ని మాత్రం పోలీసులు ఇంకా వెల్లడించలేదు. డైరెక్టర్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టరేట్‌ - అబుదాబీ పోలీస్‌ బ్రిగేడియర్‌ జనరల్‌ డాక్టర్‌ రషీద్‌ మొహమ్మద్‌ బోరాషీద్‌ మాట్లాడుతూ, ఫీల్డ్‌ ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ నకిలీ జ్యుయెలరీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గోల్డ్‌ మార్కెట్‌లో కమర్షియల్‌ ఫ్రాడ్‌కి సంబంధించి ఇంటర్నేషనల్‌ కమర్షియల్‌ ఏజెంట్‌ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తనిఖీలను నిర్వహించి ఈ ఫ్రాడ్‌ని వెలికి తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com