ప్రమాదకర స్థితిలో ల్యాబర్ క్యాంప్
- September 19, 2017
మనామా: అత్యంత ప్రమాదకర స్థితిలో ఓ ల్యాబర్ క్యాంప్ నిర్వహించబడ్తోంది. విధిలేని పరిస్థితుల్లో కార్మికులు ఈ భవనంలో నివాసం ఉండాల్సి వస్తోంది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి రాగానే, చర్యలు ప్రారంభించారు. మునిసిపల్ అధికారులు, ఈ భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. శ్లాబ్ పైనుంచి పెచ్చులు జారి పడి, కొన్ని నెలల క్రితం ఇందులో నివసిస్తున్న కార్మికులకు గాయాలు కూడా అయ్యాయి. నిబంధనల్ని ఉల్లంఘించి ఓనర్, అక్రమంగా అదనపు రూమ్‌లను నిర్వహించి, సొమ్ము చేసుకుంటున్నారని బాధిత కార్మికులు పేర్కొన్నారు. ఈ లేబర్ క్యాంప్‌లో టైలరింగ్ షాప్ కూడా నిర్వహించబడ్తోంది. 100 నుంచి 150 బహ్రెయినీ దినార్స్ వరకు ఒక్కో కార్మికుడు ఇక్కడ ఉండేందుకు చెల్లిస్తున్నట్లు అక్కడ ఉంటోన్న కార్మికులు తెలిపారు. ల్యాండ్ లార్డ్ తమ పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోవడంలేదని, భద్రత పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవడంలేదని కార్మికులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పి పడిపోయిన శ్రేయస్ అయ్యర్







