ఒమాన్ దిశగా కదులుతున్న చాపలా: సుల్తానెట్ అధికారుల అప్రమత్తo
- October 30, 2015
ఉష్ణమండల తుఫాను చాపలా, ఒమాన్ దిశగా కదులుతున్న నేపధ్యంలో, నేడు అంటే శనివారం సాయంత్రం నుండి కుండపోతగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనాల మేరకు పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వారి రక్షక దళాలు మరియు అంబులెన్స్ లు సలాలా లో నియోగించబడ్డాయి. ఈదురు గాలులు లేదా వరద వలన నీటి మట్టం పెరిగినపుడు నష్టం నివారించడానికి తాము సిద్ధంగా ఉన్నామని సుల్తాన్ వారి ఆయుధ దళాలు, రాయల్ ఒమాన్ పోలీసు సిబ్బంది కూడా ప్రకటించారు. తుఫాను ధోఫార్ మరియు యెమన్ తీర ప్రాంతాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున, ధోఫార్ గవర్నరేట్ లోని పాఠశాలలు తుఫాను సహాయక కేంద్రాలుగా మార్చినట్టు పబ్లిక్ ఆధారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ వారు తెలిపారు. కాగా మజ్లిస్ అల్ షురా యొక్క అధ్యక్షుని, ఇద్దరు ఉపాధ్యక్షుల ఎన్నిక కొరకై ఏర్పాటుచేయబడిన అత్యవసర సమావేశం, తుఫాను ప్రభావం వలన నవంబర్ 4 కు వాయిదా వేయబడింది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









