అబుదాబీ: క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులపై అదనపు రుసుముల్లేవ్‌

- September 21, 2017 , by Maagulf
అబుదాబీ: క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులపై అదనపు రుసుముల్లేవ్‌

ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ - అబుదాబీ, అన్ని కమర్షియల్‌ ఫెసిలిటీస్‌కి క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్‌ కార్డ్‌ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాల్ని పట్టించుకోని పక్షంలో, బాధ్యులకు 8,000 దిర్హామ్‌ల వరకు జీరామాన విధించబడ్తుందని హెచ్చరించారు. అబుదాబీ ఎకనమిక్‌ డెవపల్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ - హయ్యర్‌ కమిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెఎక్షన్‌ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. క్రెడిట్‌ కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు అదనంగా కొంత రుసుముల్ని వసూలు చేయడంపై కొరడా ఝుళిపించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి దఫా ఈ తరహా నేరాలకు పాల్పడితే వార్నింగ్‌, రెండోసారి 4,000 దిర్హామ్‌ల జరీమానా, మూడోసారి 6,000 దిర్హామ్‌ల జరీమానా, నాలుగోసారి నేరం రిపీట్‌ అయితే 8000 దిర్హామ్‌ల జరీమానా తప్పదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com