ప్రపంచంలోనే వింత..గుండె ఉంది లోపలే.. కొట్టుకునేది మాత్రం బయట!
- September 21, 2017
ఫ్లోరిడాకు చెందిన ఓ బాలిక అత్యంత అరుదైన సమస్యతో బాధపడుతున్నది. ఫ్లోరిడాకు చెందిన ఎనమిదేళ్ల విర్సావియా బోరన్ హృదయ స్పందనలు ఛాతి బయట జరుగుతున్నాయి. వైద్య పరిభాషలో ఈ సమస్యను ఫెంటాలొగీ ఆఫ్ కాంట్రెల్ అని పిలుస్తారని..ప్రతీ 5.5 మిలియన్ల మందిలో ఒకరికి ఇటువంటి సమస్య వచ్చే అవకాశముంటుందని డాక్టర్లు వెల్లడించారు. సాధారణంగా శరీరంలోపల జరగాల్సిన హార్ట్ బీటింగ్..విర్సావియా విషయంలో హృదయ స్పందనలు కొనసాగుతున్నంత సేపు గుండె ఛాతి బయటకు రావడం లోపలికి పోవడం జరుగుతుంది. చిన్నతనంలో క్లిష్టమైన సమస్యతో బాధపడుతున్న తన కూతురు ఎలాగైనా బతికించుకోవాలని ఆమె తల్లి ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. విర్సావియాను పరీక్షించిన వైద్యులు. విర్సావియా ఆరోగ్య పరిస్థితి చాలా సున్నితమైందని, ఆమెకు ఆపరేషన్ చేస్తే ప్రాణానికే ప్రమాదముందని తెలిపారు. హైబీపీ వల్ల ప్రాణాలు పోయే అవకాశముంటుందని డాక్టర్లు తెలిపారు. విర్సావియా తల్లి మాత్రం తన కూతురుకు ఎలాగైనా మంచి చికిత్స దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







