కాశీలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ ఎపిసోడ్
- September 21, 2017
టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్, యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలిమ్ సిటీలో వేసిన భారీ సెట్లో ఒక షెడ్యూల్, హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలలు, పొల్లాచ్చిలో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు.. అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించిన చిత్ర బృందం ప్రస్తుతం వారణాసిలో మరో యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేయబోతుంది. పీటర్ హెయిన్స్ సారధ్యంలో కాశీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నవరాత్రి ఉత్సవాల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారు. బలమైన కథ,కథనాలతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







