ఫిట్‌నెస్ అంబాసిడర్: 40 కిలోల బరువు తగ్గిన ఈజిప్టియన్
- September 22, 2017
2000 సంవత్సరంలో దుబాయ్‌కి వచ్చిన మొహమ్మద్ బెలాల్, అప్పట్లో 108 కిలోల బరువు ఉండేవారు. ప్రస్తుతం అతని బరువు ఏవలం 68 కిలోలు మాత్రమే. బెస్పోక్ రైడ్ జిమ్‌కి ఆయన ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్. ట్రయాథ్లాన్ ఛాంపియన్ షిప్‌కి ట్రెయినింగ్ కూడా అవుతున్నారాయన.2013లో ట్రయథ్లాన్ పట్ల ఖచ్చితమైన పట్టుదల పెరిగిందనీ, ఈ విషయాన్ని సన్నిహితులతో చెబితే, వారంతా తనను చూసి నవ్వారనీ, దాంతో సీరియస్‌గా తీసుకుని బరువు తగ్గి, ట్రయాథ్లాన్ పోటీల కోసం సిద్ధమయ్యానని చెప్పారు మొహమ్మద్ బెలాల్. ట్రైనింగ్‌లో మొహమ్మద్ పలు యాక్సిడెంట్స్‌ని చవిచూడాల్సి వచ్చింది. ఓ ప్రమాదంలో షార్ట్ మెమరీ లాస్ అయితే, ఇంకోస ప్రమాదంలో కాలర్ బోన్ విరిగిపోయింది. అయినా శిక్షణ మాత్రం ఆపలేదు. ఇరోన్‌మాన్ 70.3 ట్రయథ్లాన్ వరల్డ్ ఛాంపియన్‌లో రెండుసార్లు క్వాలిఫై అయినా, ఆర్థిక ఇబ్బందులతో ఆ పోటీల్లో పాల్గొనలేకపోయాడు. ఈ ఏడాది తనకు స్పాన్సర్ దొరుకుతారని ఆశిస్తున్నాడాయన.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









