ఇంటర్నెట్ కాల్స్ పై నిషేధం ఎత్తివేసిన కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియా : స్మార్ట్ఫోన్ వినియోగదారులు

- September 22, 2017 , by Maagulf
ఇంటర్నెట్ కాల్స్ పై  నిషేధం ఎత్తివేసిన కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియా :  స్మార్ట్ఫోన్ వినియోగదారులు

రియాడ్:  కింగ్డమ్ అఫ్ సౌదీ అరేబియా ఇంటర్నెట్ కాల్స్ పై  నిషేధం ఎత్తివేసినట్లు వీడియో వాయిస్ కాల్ సేవలు అనుమతిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో సౌదీ లోని  స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ఈ నెల ప్రారంభంలో కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్-స్వాహా, బుధవారం నుంచి వాటిని అమలులోకి వచ్చేలా ఏర్పాటుచేసింది. వినియోగదారులు ఇంటర్నెట్ కాల్స్ పై నియంత్రణ నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వు జారీ చేసింది. ఈ చర్యద్వారా కింగ్డమ్ మొత్తం మీద  పేస్ టైం , స్నాప్ఛాట్ , స్కైప్, లైన్, టెలిగ్రామ్ మరియు టాంగో వంటి సేవలు స్మార్ట్ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి..సౌదీ అరేబియాలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న శ్రీలంక జాతీయవాది మొహమ్మద్ ఆలీ ఈ చర్య గురించి సంతోషంగా ఉన్నట్లు  చెప్పారు."నేను యాప్ ల ద్వారా  ఈ కాల్ చేసేందుకు   ప్రయత్నించాను నా బంధువులతో తిరిగి మాట్లాడటానికి అవకాశం దొరికిందిఅని తెలిపారు. గతంలో తానూ  చాలామంది బంధువులు మరియు స్నేహితులకు మాట్లాడటానికి కాల్స్ పై  చాలా ఎక్కువ డబ్బు  ఖర్చు చేసినట్లు  రియాద్ నివాసి ఐఫాట్ ఆబ్రూ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com