జగ్గీ వాసుదేవ్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు

- September 22, 2017 , by Maagulf
జగ్గీ వాసుదేవ్ ని కలిసిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు

ప్రముఖ దార్శనిక వేత్త సద్గురు జగ్గీ వాసు దేవ్ చేపట్టిన ర్యాలీ ఫర్ రివర్ అంటే మన నదుల్ని మనమే కాపాదుకొందాం అనే కార్యక్రమానికి చిరంజీవి కూడా తన మద్దతు ప్రకటించారు.. అంతేకాదు.. సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఆయన నివాసం లో రామ్ చరణ్ దంపతులు కలిసి.. ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు.. దేశంలోని నదీ జలాల సంరక్షణ కోసం ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమాన్ని సద్గురు ప్రారంభించారు.. నదుల సంరక్షణపై అవగాహన కలిపిస్తూ దేశ వ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.. కాగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ని చిరంజీవి కుటుంబ సభ్యులు కలిశారు.. చిరంజీవి, సురేఖ దంపతుల తో పాటు.. రామ్ చరణ్, ఉపాసనా దంపతులు.. అల్లు అరవింద్ అల్లు అరవింద్ ఫ్యామిలీ .. అపోలో గ్రూప్ కు చెందిన ఫామిలీ సభ్యులు అందరూ జగ్గీ వాసుదేవ్ ని కలిసి ఆత్మీయ సన్మానం చేశారు.. కాగా ఇప్పటికే చిరంజీవి ర్యాలీ ఫర్ రివర్ కార్యక్రమం లో పాల్గొనమ మని 80009 80009 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వమని చిరంజీవి ఓ వీడియో మెసేజ్ ద్వారా ప్రజలను కోరిన సంగతి తెలిసిందే.. నదులను కాపాడుకొని భావి తరాలకు నీరుని అందించాలని ఇందుకు ప్రజలందరూ చేతులు కలపాలని కోరుతూ చిరు మనవాళికి పిలుపు నిచ్చారు..  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com