భెండిర్ సోర్‌సొరి
- September 23, 2017
కావలసిన పదార్థాలు:
బెండకాయలు - 4 కప్పులు (మధ్యకు కోసుకోవాలి), నూనె - 2 టే.స్పూన్లు, ఆవ ముద్ద - 2 టే.స్పూన్లు (ఆవాలు నానబెట్టి రుబ్బుకోవాలి), అల్లం పేస్ట్ - 1 టీస్పూను, పచ్చిమిర్చి - 2, పండు మిరపకాయ - 1, బిర్యానీ ఆకు - 1, జీలకర్ర, ఆవాలు, మెంతులు, నల్లజీలకర్ర, సోంపుల మిశ్రమం(పాంచ్‌పోరన్) - అర టే. స్పూను, పసుపు - అర టీస్పూను. ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ విధానం:
బాండీలో నూనె వేడి చేసి పాంచ్ పోరన్, బిర్యానీ ఆకు, పండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత బెండకాయలు వేసి స్టిర్ ఫ్రై చేయాలి. పసుపు వేసి మరో 10 నిమిషాలు తరచుగా కలుపుతూ వేయించాలి. తర్వాత ఆవ ముద్ద, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ వేసి చిన్న మంట మీద 5 నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి. ఇలా గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించి రోటీతో వడ్డించాలి.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







