తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్న రోబోలు

- September 23, 2017 , by Maagulf
తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్న రోబోలు

ఇంతవరకూ ఆపరేషన్లలో డాక్టర్లకు సహాయం చేసిన మరమనుషులు.. ఇప్పుడు తమంతట తామే సర్జరీలు చేస్తామంటున్నాయి. చైనాలోని ఓ రోబో.. డెంటిస్ట్‌ అవతారం ఎత్తింది. ఓ పేషెంట్‌కు.. రెండు పళ్లను ఫిక్స్ చేసింది. డెంటిస్ట్‌‌ రోబోను చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. మనుషుల సహాయం లేకుండానే ఇది చికిత్స చేయగలదు. మనుషుల వల్ల జరిగే పొరపాట్లేవీ దీనివల్ల జరగవంటున్నారు. చైనాలో ప్రస్తుతం డెంటిస్ట్‌ల కొరత చాలా ఎక్కువగా ఉందట. ఈ రోబో వల్ల ఆ సమస్య పరిష్కారమవుతుందంటున్నారు. 

డెంటింస్ట్ రోబో చేస్తున్న ఫస్ట్‌ ట్రీట్‌మెంట్ కావడంతో.. డాక్టర్లు కూడా దానిపక్కనే ఉండి ఎలా చేస్తుందో పరీక్షించారు. అయితే.. దానికి ఎలాంటి సాయం మాత్రం చేయలేదు. అన్ని పనులూ అదే చేసుకుంది. దాదాపు గంటసేపు ట్రీట్‌మెంట్ చేసిన రోబో.. ఓ  మహిళకు జాగ్రత్తగా రెండు కొత్త పళ్లను అమర్చింది. ఈ పళ్లను కూడా త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీతో తయారు చేశారట. ఫస్ట్‌ ట్రీట్‌మెంట్ సక్సెస్ కావడంతో.. ఇలాంటి మరిన్ని రోబోలను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు చైనా పరిశోధకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com