కురుల ఆరోగ్యానికి ఈ సూత్రాలు పాటించి చూడండి...

- April 28, 2015 , by Maagulf
కురుల ఆరోగ్యానికి ఈ సూత్రాలు పాటించి చూడండి...

మహిళల అందాన్ని ప్రతిబింబించే అతి ముఖ్యమైన వాటిల్లో జుట్టు కూడా ఒకటి. కురుల సౌందర్యం గురించి ఎందరో కవులు ఎన్నెన్నో విధాలుగా వర్ణించారు. అందుకే కురుల అందం కోసం మగువలు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. మార్కెట్లో ఎన్నో రకాల షాంపూలు అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కోసారి ఒక్కో షాంపూని ట్రై చేయడం జరుగుతుంటుంది. జుట్టు సంరక్షణ, షాంపూ వినియోగానికి సంబంధించి కొన్ని అపోహలూ ఉన్నాయి. అపోహలేంటో, వాస్తవాలేంటో చూద్దాం. రోజూ తలస్నానం చేస్తేనే జుట్టు ఆరోగ్యంగా వుంటుందనేది చాలామంది నమ్మకం. కానీ జుట్టు మరీ జిడ్డుగా ఉన్నప్పుడే తలస్నానం చేస్తే మంచిది. వారానికి రెండు సార్లు కన్నా ఎక్కువ జుట్టుకి షాంపూ పట్టిస్తే, జుట్టు ఆరోగ్యం పాడవుతుంది. ఎప్పుడూ ఒకే షాంపూ వాడకూడదన్న అభిప్రాయమూ కొందరిలో ఉంటుంది. అది కూడా తప్పే. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూని ఎంపిక చేసుకోవాలి. పదే పదే షాంపూలను మార్చడం వల్ల జుట్టుపై ప్రయోగాలు ఎక్కువై సమస్యలు, జుట్టు పాడయిపోతుంది. వేడి నీళ్ళతో జుట్టు పాడైపోతుందనీ, చన్నీళ్ళతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుందనీ కొందరు అంటుంటారు. బాగా వేడిగా ఉన్న నీళ్ళు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బాగా చల్లగా ఉండే నీళ్ళూ అంతే. గోరు వెచ్చటి నీళ్ళు తలస్నానానికి మంచిది. చన్నీళ్ళతో జుట్టు సమస్యలు తక్కువ బాగా వేడి నీళ్ళతో పోల్చి చూసినప్పుడు. ఎక్కువ నురుగు వచ్చేలా జుట్టుకి ఎక్కువ షాంపూ పట్టించేస్తే, జుట్టు మెరవదు సరికదా, జుట్టు పటుత్వం కోల్పోతుంది.  ఈ చిట్కాలు పాటించి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com