7 కప్స్ స్వీట్

- April 29, 2015 , by Maagulf
7 కప్స్ స్వీట్

ఈవారం ఒక స్వీటుతో మీ ముందుకు వచ్చా.."7 కప్స్ స్వీట్" ..

 

కావలసిన పదార్ధాలు:

  • నెయ్యి                      - 2 కప్పులు
  • శెనగపిండి                  - 1 కప్పు
  • కొబ్బరి తురుము         - 1 కప్పు
  • పాలు                       - 1 కప్పు
  • పంచదార                  - 2 కప్పులు

చేయు విధానం:

  • ఒక బాండీలో నెయ్యి వేసి వేడి చెయండి. ఇందులో శెనగపిండి వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించండి.
  • ఇప్పుడు కొబ్బరి తురుము ని వేసి కాస్త రంగు మారేదాకా వేయించాలి.
  • కొబ్బరి కాస్త రంగు మారిన వెంటనే పాలు పోసి మిశ్రమం అంతా దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలి.
  • వెంటనే పంచదార పోసి స్టవ్ మీద నుండి దించేయండి.
  • ఒక వెడల్పాటి ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్ లో వేసి మేకు కావలసిన షేప్స్ లో ఒక కత్తి తో కట్ చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే 7 కప్స్ స్వీట్ రెడీ!!
  • జీడిపప్పు నెయ్యి లో వేయించి పీసెస్ మీద గార్నిష్ కి వాడుకోవచ్చు.

 

------ ప్రవీణ, బహ్రెయిన్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com