అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యపై , ఆమె ప్రియుడి మొహాలపై యాసిడ్ పోసిన భర్త
- September 24, 2017
షార్జా: ఫేస్ బుక్ లో పెట్టిన ఓ ఫోటో ...ఆయా అక్రమ సంబంధ జంట మొఖాలపై యాసిడ్ పోయడానికి కారణమైంది. మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. కొందరి జీవితాలలో ఆలుమగల మధ్య అనురాగం..ఒకరికోసం ఒకరు నమ్మకంగా ఉండటం అనేది కరువైపోతుంది. యూఏఈలోని షార్జా నగరంలో జరిగిన ఈ ఘటన దిగజారిపోయిన దాంపత్య విలువుల ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో చెబుతుంది, 30 ఏళ్ల వ్యక్తి తన భార్యతో షార్జా నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. తన వృత్తి నిమిత్తం భార్య మీద నమ్మకంతో ఓ పని మీద తన స్వదేశం శ్రీలంక వెళ్లాడు. భార్య మాత్రం షార్జాలోని అపార్ట్‌మెంట్‌లోనే వంటరిగా ఉంది. శ్రీలంకలో ఉన్న భర్త ఓ రోజు ఫేస్‌బుక్‌లో తన భార్య టైం లైన్లో కనిపించిన ఫోటో చూసి నమ్మలేకపోయాడు. తన భార్యతో వేరే వ్యక్తి చనువుగా ఉన్న చిత్రాన్ని చూసి నివ్వెరపోయాడు. వారి చనువుపై అనుమానించాడు. తన భార్యకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా శ్రీలంక నుండి షార్జా నగరంకు వెళ్లాడు. ఆ సమీపంలోని ఒక హోటల్లో అద్దెకు దిగి తన భార్య వ్యవహారాన్ని కదలికలను గమనించడం ప్రారంభించాడు. వారిద్దరూ తన అపార్ట్మెంట్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో తలుపు నెట్టుకొని లోపాలకి వెళ్ళాడు. దీంతో కంగారుపడిన .25 ఏళ్ల వయసున్న భార్య.. తన కన్నా రెండేళ్ల చిన్నవాడైన 23 ఏళ్ల కుర్ర ప్రియుడితో జోరుగా అక్రమసంబంధాన్ని కొనసాగిస్తోందని రెడ్ హ్యాండ్ గా గ్రహించాడు. తన వెంట తెచ్చుకొన్న యాసిడ్ ను ఇద్దరి మోహాలపై పోశాడు. తీవ్రగాయాలపాలైన వీరిద్దరినీ దగ్గరిలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. దాడి అనంతరం తన దేశం శ్రీలంక వెళ్లిపోయేందుకు సిద్ధమైన ఆ భర్తను విమానాశ్రయంలో షార్జా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన భార్య ఇలా మోసం చేసిందంటే ఏమాత్రం నమ్మలేకపోయానని, మోసం చేస్తుందని ఊహించలేకపోయానని అందుకే ఈ యాసిడ్ దాడి చేశానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







