ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- January 21, 2026
యూఏఈ: ఇండియాకు చెందిన విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఫిబ్రవరి 5 నుండి అహ్మదాబాద్ మరియు షార్జా మధ్య నాన్-స్టాప్ విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వీస్ ద్వారా గుజరాత్ మరియు యూఏఈ మధ్య విమాన కనెక్టివిటీ బలోపేతం అవుతుందని వెల్లడించింది. ముఖ్యంగా వ్యాపార ప్రయాణికులు, పర్యాటకులకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
దుబాయ్ తర్వాత షార్జా యూఏఈలో స్పైస్‌జెట్ కు రెండవ గమ్యస్థానంగా ఉండనుంది. కొత్త సర్వీస్ మంగళవారాలు మరియు బుధవారాలు మినహా వారానికి ఐదు రోజులు నడుస్తుంది. అహ్మదాబాద్ నుండి విమానాలు రాత్రి 8:20 గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు షార్జాకు చేరుకుంటాయి. తిరుగు ప్రయాణం రాత్రి 11.20 గంటలకు షార్జా నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటాయని అని స్పైస్‌జెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ డెబోజో మహర్షి తెలిపారు.
ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లోని బుకింగ్ వివరాల ప్రకారం, రిటర్న్ ఛార్జీలు ప్రస్తుతం Dh900 నుండి అందుబాటులో ఉన్నాయి. అహ్మదాబాద్–షార్జా ఫ్లైట్ బుకింగ్‌లను స్పైస్‌జెట్ వెబ్సైట్, మొబైల్ యాప్ మరియు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







