యెమెన్ రెబెల్ క్షిపణిని సౌదీ సమర్ధవంతంగా అడ్డుకొంది
- September 24, 2017
సౌదీ అరేబియా: యెమెన్ నుంచి వెలువడిన ఒక రెబెల్ క్షిపణిని సౌదీ అరేబియా దళాలు శనివారం అర్ధరాత్రి సమర్ధవంతంగా అడ్డుకొంది. రాజ్య స్థాపనకు గుర్తుగా దేశవ్యాప్తంగా జరిపిన వేడుకలు మధ్యలో ఉన్నాయి. సౌదీ అధినేత సంకీర్ణ ప్రధానమైన ఖమిస్ ముషిత్ ను లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణి యెమెన్ నుంచి ప్రయోగించబడింది. రక్షణ కార్యకలాపాలు ఎయిర్ బేస్ ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్షిపణి ప్రయోగం కారఖ్నంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం లేకుండా అడ్డుకున్నట్లు తెలిపారు. "సౌదీ రాయల్ వైమానిక దళం యెమానీ భూభాగంలోని ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కనుగొన్నట్లు తెలిపింది," సంకీర్ణ దళాలు ఆ ప్రయోగశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. "సౌదీ అరేబియా రాజ్యంలో జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకొంటుంది, కచేరీలు, జానపద నృత్యం మరియు బాణాసంచాలతో సందడి చేస్తున్న సమయంలో ఈ బాలిస్టిక్ క్షిపణి దాడులు చేయడం ఎంతో తీవ్రమైన చర్య అని ఆయన అన్నారు.అలాగే దక్షిణ సరిహద్దుపై మరింత తరచుగా స్వల్ప-శ్రేణి రాకెట్ ప్రయోగాలు అధికమైనట్లు ఆయన తెలిపారు.గతంలో యెమెన్‌లో తిరుగుబాటుదారులపై సంకీర్ణ వైమానిక దాడులను నిర్వహించబడ్డాయి. గత వారం, తిరుగుబాటుదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వద్ద క్షిపణులను ప్రయోగించేందుకు మరియు ఎర్ర సముద్రంలో సౌదీ ట్యాంకర్లపై దాడి చేసేందుకు యత్నించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







