రాణి పద్మవతి భర్త రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్
- September 24, 2017
బాలీవుడ్ బయోపిక్ ల బాటా పట్టింది.. క్రీడా.. హిస్టరీ నేపద్యం కథలను తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించుకొంటున్నారు. ఈ నేపద్యంలో మరో హిస్టారికల్ మూవీ బాలీవుడ్ లో తెరకెక్కుతున్నది. అదే పద్మావతి సినిమా... ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణే రాణి పద్మావతిగా నటిస్తుండగా... షాహిద్ కపూర్, రణ్ వీర్ సింగ్ ప్రధాన ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో "రాణి పద్మావతి" ఫస్ట్ లుక్ ని ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.. కాగా తాజాగా పద్మావతి భర్త మహారావల్ రతన్ సింగ్ పాత్రను పరిచయం చేస్తూ.. నేడు ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.. పద్మవతి భర్తగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.. ఈ పోస్టర్ లో షాహిద్ ఒంటి నిండా గాయాలతో... దైర్యం నిండిన కళ్ల తో ఉన్న రతన్ సింగ్ ఆహార్యం కనిపిస్తుంది.. షాహిద్ లుక్ ఆకట్టుకొన్నది. కాగా మరో ప్రధాన పాత్ర అయిన అల్లా ఉద్ధీన్ ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు.. మరి ఖిల్జీగా రణ్ వీర్ లుక్ ఎలా ఉండబోతున్నది అనే ఆతృత అటు సినీ వర్గాల తో పాటు ఇటు ప్రేక్షకుల్లోనూ ఉన్నది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









