పవన్ కళ్యాణ్ కు మరో అంతర్జాతీయ అవార్డు
- September 25, 2017
టాలీవుడ్ స్టార్ హీరో... జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పవన్ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబీఎఫ్) ఎక్సలెన్స్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఆయనకు ఈ అవార్డ్ ను నవంబర్ 17న హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో ఈ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం అందజేయనున్నది.
కాగా ఇటీవల పవన్ కల్యాణ్ ను అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ గౌరవించగా... తాజాగా ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఎక్స్ లెన్స్ అవార్డ్ ప్రధానం చేయనున్నది. ఐఈబీఎఫ్ వారు ఏటా వివిధ రంగాల్లో సేవలు అందజేసిన వారికి ఈ అవార్డ్ తో గౌరవిస్తుంది. ఈ సందర్భంగా ఐఈబీఎఫ్ ఇండియా విభాగం అధిపతి సునీల్ గుప్తా.. సమన్వయ కర్త చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ నటుడిగా రాజకీయ నాయకుడిగా కోట్లాది మంది అభిమానం సంపాదించుకొన్నారు అని తెలిపారు.. అంతేకాదు.. సమాజంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై పవన్ కల్యాణ్ స్పందించిన తీరు ఆకట్టుకొన్నది అని అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవడం లో పవన్ మానవత్వం, చేనేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు.. సామాజిక సమస్యల పరిష్కారంలో పవన్ చూపిన చొరవ చాలా మంది హృదయాలను ఆకట్టుకొన్నది అని వారు ప్రశంసల వర్షం కురిపించారు.. ఈ అవార్డ్ అందుకోమని.. పవన్ ను కలిసిన సునీల్, చంద్రశేఖర్ లు ఆహ్వానాన్ని అందజేశారు.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







