కోవా సేమ్యా పాయసం
- September 25, 2017
కావలసినవి : సేమ్యా - 400గ్రా, పంచదార - 400గ్రా, నెయ్యి - 150గ్రా, పాలు - 400 మి. లీ, కుంకుమ పువ్వు - అర టీ స్పూన్
అలంకరణకి, కోవా - 200 గ్రాములు, పిస్తా (ముక్కలుగా తరిగినవి) - 10 గ్రాములు, బాదం పప్పు (ముక్కలుగా తరిగినవి)- 30 గ్రాములు
జీడిపప్పు (ముక్కలుగా తరిగినవి) - 50 గ్రాములు
తయారీ విధానం...
పాలలో నానబెట్టిన కుంకుమపువ్వుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కోవాని చిదిమి బ్రౌన్ కలర్ వచ్చిందాక వేగించి పక్కన పెట్టుకోవాలి.
నెయ్యిని వేడి చేసి అందులో సేమ్యా వేసి సన్నని సెగ మీద బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించి అందులో పాలుపోయాలి. రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చాక పంచదారని కూడా వేసి బాగా కలియబెట్టండి. పంచదార కరిగి నీరు ఇగిరి పోయిందాకా మెల్లిగా ఉడికించండి. అందులో కుంకుమపువ్వుని కూడా వేసి సేమ్యా పొడిగా అయిన తరువాత సగం కోవాని అందులో వేసి బాగా కలపండి. ఒక గిన్నె తీసుకుని అందులో సేమ్యా పాయసాన్ని వేసి దానిపైన మిగిలిన కోవా, బాదం, పిస్తా, జీడిపప్పుతో అలంకరించి వడ్డించండి. ఇది నలుగురికి సరిపోతుంది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్







