'లక్ష్మీస్.. ఎన్టీఆర్' మూవీ ఫస్ట్ లుక్
- September 26, 2017
వెండి తెర బయోపిక్ ల బాట పట్టింది. తాజాగా దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను వెండితెరపై సినిమాగా ఆవిష్కరిస్తానని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. ఈ నేపద్యంలో ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు.. లక్ష్మీస్.. ఎన్టీఆర్ అనే టైటిల్ తో ఈ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ ఓ చైర్ లో కూర్చుని ఉంటే.. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి అడుగు పెట్టడానికి గడప దాటుతున్నట్లు ఉన్నది.. మరి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన మొదటి లుక్ ని రిలీజ్ చేసినంత ఫాస్ట్ గా సినిమాని కూడా తెరకెక్కించి రిలీజ్ చేస్తాడా..!! ఆ సినిమాలో ఎన్టీఆర్ జీవిత ప్రయాణం అంటే.. బాల్యం, విద్య, వివాహం, రాజకీయం లకు సంబంధించిన అన్నింటిని చూపిస్తాడా..! లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి అడుగు పెట్టాక చోటు చేసుకొన్న సంఘటనలను చూపిస్తాడా..!లేదా ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సినిమాను తెరకెక్కిస్తాడా..! చూడాలి మరి.. కాగా ఎన్టీఆర్ బయోపిక్ ను సినిమా తీస్తానని.. ఆ సినిమాలో ఎన్టీఆర్ గా తానే నటిస్తానని బాలకృష్ణ ప్రకటించిన సంగతి విధితమే..
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







