రామ్ తో ఫైటింగ్ కి రెడీ అయిన గోపీచంద్

- September 26, 2017 , by Maagulf
రామ్ తో ఫైటింగ్ కి రెడీ అయిన గోపీచంద్

రామ్ తో ఫైటింగ్ కి సై అంటోన్న గోపీచంద్


రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. నేను శైలజ సినిమా తర్వాత రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తోన్న ఈసినిమా అక్టోబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఈసినిమాలో రామ్ తో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి జోడీ కట్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాలో రామ్ అభిరామ్ అనే రాక్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. కొత్త హెయిర్ స్టైల్ అండ్ బియర్డ్ తో ఈ లవర్ బాయ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈసినిమాతో పాటే గోపీచంద్ ఆక్సీజన్ కూడా అక్టోబర్ 27న రిలీజ్ అవుతోంది. రాశి ఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్ గోపీచంద్ తోజత కట్టారు. షూటింగ్ టైంలోనే ఆక్సీజన్ అందని పేషెంట్ లాగా బండి లాక్కొచ్చిన ఈ సినిమాతోనే గోపీచంద్.. రామ్ తో ఫైట్ చెయ్యబోతున్నాడు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ట్రాక్ తప్పిన గోపీచంద్, రామ్ ఉన్నది ఒక్కటే జిందగీని తట్టుకుని ఏమేర వసూళ్లు రాబడుతాడు? అన్నదే ఆక్సీజన్ సక్సెస్ ను డిసైడ్ చేయబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com