న్యూజిలాండ్‌ ఆక్లాండ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- September 27, 2017 , by Maagulf
న్యూజిలాండ్‌ ఆక్లాండ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఆక్లాండ్ లో తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ ఆధ్వర్యంలో మహా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. సుమారు 500 మందికి పైగా మహా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ని ప్రతిబింబించే ఈ పూల పండగలో ఇతర రాష్ట్ర ప్రజలతోపాటు చైనీస్ మరియు కివీస్ వాసులు కూడా పాలు పంచుకున్నారు. మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ వేడుకలు జరుపుకున్నారు. దాదాపు 5 గంటలు విరామం లేకుండా బతుకమ్మ ఆటలు ఆడారు. TJNZ (తెలంగాణ జాగృతి న్యూజిలాండ్) మొదటి బతుకమ్మ సంబురాలు అంబరాన్ని తాకేలా జరిగాయి. బతుకమ్మ పాటలు, అందమైన బతుకమ్మలు, అందమైన సాంప్రదాయ వస్త్రధారణ వంటి ఎన్నో అంశాలలో పోటీలు నిర్వహించి విజేతలకు అందమైన చేనేత చీరలతోపాటు మరెన్నో బహుమతులు అందచేశారు. మళ్లీ ఏడాదికి రమ్మని ఆహ్వానిస్తూ మన బంగారు బతుకమ్మను మహిళలు సాగనంపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ జ్యోతి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు TJNZ తమ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన్దీప్ కౌర్ న్యూజిలాండ్‌ పోలీస్‌ శాఖ , నీలిమ (శాంతి నివాస్ చారిటబుల్ ట్రస్ట్), శ్రీ జీత్ ( భారతీయ చారిటబుల్ ట్రస్ట్) పాల్గొన్నారు.

TJNZ ఆధ్వర్యంలో మన తెలంగాణ సంప్రదాయంలో అతిథులకు స్వాగత సత్కారాలు, సన్మానాలు ఘనంగా జరిపారు. ఈ సంబరాల్లో TJNZ ఆత్మీయులు, వర్ష రెడ్డి పట్లోళ్ల, శ్రీ రామ్ యాదవ్ బిజ్జు, రాజవర్ధన్ రెడ్డి, శీతల అల్లం, రాఘవేంద్ర కట్టెల, ప్రసన్న గుమ్ముడవెల్లి, కవిత మన్నెం, శ్రీలత అల్లే, విజయలక్ష్మి ముమ్మడి, శ్వేతా పట్లోళ్ల, శ్రీమతి నిర్మల మోహన్, సరితా విక్రమ్, సంధ్య జగన్, అయ్యుబ్ ఖాన్, విజయ్ సిరిసిల్ల, సోమేశ్ బండ్ల, తెలుగు అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ అధ్యక్షులు ధర్మేందర్ అల్లే , తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూజీలాండ్ అధ్యక్షులు కళ్యాణ్ కాసుగంటి, తెరాస న్యూజీలాండ్ అధ్యక్షులు విజయ్ కోసన తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com