ఎతిహాద్ ఎయిర్వేస్ పైలట్ మృతి
- September 27, 2017
దుబాయ్ నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళాల్సిన ఎతిహాద్ ఎయిర్వేస్ విమానం కువైట్‌లో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. పైలట్ మృతితో ఈ ఎమర్జన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. కువైట్‌లో విమానం ల్యాండ్ అవుతున్న సమయానికి మెడికల్ టీమ్‌ని అక్కడ ఏర్పాటు చేశారు. అయితే పైలట్ ప్రాణాల్ని మాత్రం కాపాడలేకపోయారు. కెప్టెన్ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఎమర్జన్సీ కాల్ చేసి, కువైట్‌కి విమానాన్ని జాగ్రత్తగా మళ్ళించారు. ఈ ఘటన పట్ల తాము తీవ్రంగా కలత చెందినట్లు ఎతిహాద్ ఎయిర్ వేస్ పేర్కొంది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామనీ, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని ఎతిహాద్ ఎయిర్ వేస్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







