హైదరాబాద్‌లో కెమో ఫార్ములేషన్స్ యూనిట్
- September 27, 2017
-ఐదేండ్లలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ హైదరాబాద్, సెప్టెంబర్ 27: స్పెయిన్‌కు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ సేవల సంస్థ కెమో గ్రూపు..ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్‌లో ఉత్పత్తి కేంద్రాన్ని బుధవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కే ఆర్ కుమార్ మాట్లాడుతూ..భారత్‌లో వ్యాపారాన్ని విస్తరించడానికి వచ్చే నాలుగు నుంచి ఐదేండ్లకాలంలో రూ.400-500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. దీంట్లోభాగంగానే రూ.100 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌కు సమీపంలోని జినోమి వ్యాలీలోగల ఐదు ఎకరాల స్థలంలో పరిశోధన కేంద్రాన్ని, తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే రెండు నుంచి మూడేండ్లకాలంలో ఈ యూనిట్‌ను మరింత విస్తరించడానికి రూ.75-100 కోట్లు, మూడో విడుతలో భాగంగా మరో రూ.100 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ యూనిట్లో 35 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, 2020 నాటికి ఈ సంఖ్య 100కి చేరుకోనున్నదన్నారు. మూడోదఫా విస్తరణ పనులు పూర్తయితే సిబ్బంది సంఖ్య 300 నుంచి 350కి చేరుకోనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కేంద్రంలో ఉత్పత్తైన ఔషధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నది. దేశీయ ఫార్మా రంగంలో స్పెయిన్‌కు చెందిన సంస్థ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి.
ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి అక్టోబర్ 2015లోనే రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







