మయన్మార్ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని సర్జికల్ స్ట్రైక్స్..!
- September 27, 2017
గతేడాది పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ.. ఈసారీ మయన్మార్ సరిహద్దుల్లో అలాంటి ఆపరేషనే నిర్వహించింది. తరచూ సైన్యంపై కాల్పులు జరుపుతున్న నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మెరుపుదాడులు చేసింది. ఈ విషయాన్ని ఈస్టర్న్ కమాండ్ తమ అధికారిక ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్టు చెప్పింది.
బుధవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో సైన్యం ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో మొత్తం 70 మంది పారా కమెండోలు పాల్గొన్నారు. ఉదయం తిరుగుబాటు దారులు సైన్యంపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ప్రకటించంది. ఈ ఆపరేషన్ కోసం అంతర్జాతీయ సరిహద్దులను దాటలేదని స్పష్టం చేసిన అధికారులు.. ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించారు.
మయన్మార్ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని NSCN(K) ఉగ్ర శిబిరాలపై దాదాపు ఈ దాడులు జరిగాయి. 2015 జూన్‌లో కూడా లక్ష్యంగా మయన్మార్ సహకారంతో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అప్పట్లో సరిహద్దుల్లో ఉన్న సుమారు 50 పైగా క్యాంపులు ధ్వంసం చేసింది. నాగా ఉగ్రవాదులు మణిపూర్ లో 18 మందిని చంపడంతో ప్రతీకారంగా ఆర్మీ ఈ దాడులు జరిపింది. తాజాగా మరోసారి అదే తరహా దాడులు చేసింది. గత ఏడాది POKలో మెరుపుదాడులు చేసిన సైన్యం 4 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, దాదాపు 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







