భారత ఐటీ కంపెనీలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ షాక్
- September 28, 2017
-ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులు, -హెచ్-1బీ వీసాలపై సమీక్షిస్తామన్న అమెరికా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: భారత ఐటీ కంపెనీల నెత్తిన మరో పిడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. అమెరికాలో ఉండే ఐటీ కంపెనీలు విదేశాలకు ఔట్‌సోర్సింగ్ ఇవ్వడాన్ని సమీక్షిస్తామని ప్రకటించారు. భారత ఐటీ సంస్థలతో కుదిరిన ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టులతోపాటు హెచ్1బీ వీసాలపైనా సమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాము ఇచ్చిన కాంట్రాక్టులపై, ప్రాజెక్టుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాల్సిందిగా టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. నాలుగునెలల్లోగా ఈ నివేదికలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. అమెరికాలో 3.2-3.5శాతం కాంట్రాక్టులను కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పలు భారత కంపెనీలే దక్కించుకున్నాయి. వీటి విలువ వేల కోట్ల డాలర్లు ఉంటుంది.
ఔట్‌సోర్సింగ్ విధానాలనే కాకుండా, హెచ్-1బీ వీసాలపైనా సమీక్షించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించడంతో భారత ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్‌లో కూడా ఆంక్షలు విధిస్తే భారత ఐటీ పరిశ్రమ కుప్పకూలుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని వేల మంది ఉద్యోగులపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని విశ్లేషిస్తున్నారు.
బై అమెరికన్.. హైర్ అమెరికన్ నినాదంతో అధికారం చేజిక్కించుకున్న ట్రంప్.. విదేశీ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా కంపెనీలకు, అమెరికన్లకు తమ ప్రభుత్వ హయాంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెబుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







