తెలంగాణలో ఈ రోజు నుంచి కొత్త మద్యం పాలసీ అమలు
- September 30, 2017
తెలంగాణలో పాతమద్యం దుకాణాల గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. ఇవాళ్టి (అక్టోబర్ 1) నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభం కానుంది. గతనెల 12న టీ. సర్కార్ ఈ నూతన మద్యం పాలసీని తీసుకువచ్చింది. ఈ పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది.
రెండు గంటలు పెంపు..
రెండు సంవత్సరాల పాలసీలో ఇప్పుడున్న సమయం కంటె రెండు గంటల ఎక్కువ సమయం మద్యం అమ్ముకోవచ్చని తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఉంది. కాగా నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిచ్చింది. మద్యం దుకాణాలలో తప్పనిసరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తప్పనిసరిగా చేయాల్సినవి..
ప్రతి మద్యం దుకాణంలో తప్పనిసరిగా సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలి.
హెచ్పీఎఫ్ఎస్ సిస్టం(బార్ కోడింగ్ కొరకు) ఏర్పాటు చేసుకోవాలి.
ఎంఆర్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరపాలి.. లేనిచో కఠిన చర్యలు తప్పవని సర్కార్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







