షిర్డీ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్రపతి
- October 01, 2017
షిర్డీ యాత్రికులకు శుభవార్త. షిర్డీ విమానాశ్రయాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం అహ్మద్‌నగర్‌లో ప్రారంభించారు. అనంతరం ముంబయికి అలయన్స్ ఎయిర్ కమర్షియల్ ఫ్లయిట్‌కు పచ్చజెండా ఊపారు.మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది.
షిర్డీ సాయిబాబా సమాధి వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో ఏడాది పొడవున జరిగే కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా కోటి మంది భక్తులు షిర్డీ తరలిరానున్నారు. విమానాశ్రయం ప్రారంభం కావడంతో ముంబయి-షిర్డీల మధ్య 240 కిమీ దూరం ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి కేవలం 45 నిమిషాలకు తగ్గింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితర ప్రముఖలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







