ముందు విమానంలో ప్రయాణించండి ....తర్వాత నెలవారీ చెల్లింపులో టిక్కెట్ల సొమ్ము చెల్లించండి
- October 01, 2017
దుబాయ్: యూఏఈ విమానయాన సంస్థ ఇతిహాద్ ఎయిర్వేస్ 'ప్లై నౌ అండ్ పే లేటర్' స్కీమ్‌ను లాంచ్ చేసింది. ఈ స్కీమ్ కింద నెలవారీ వాయిదాల పద్ధతిలో టిక్కెట్ ఛార్జీలను చెల్లించుకునే ఆప్షన్‌ను ఈ విమానయాన సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా కుటుంబ సభ్యులు తమ విమాన టిక్కెట్లను వారి సౌలభ్యం మేరకు బుక్ చేసుకోవచ్చని, అవసరాలకు అనుగుణంగా చెల్లింపు ప్రణాళికలను ఎంచుకోవచ్చని ఇతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. పేఫోర్ట్తో భాగస్వామ్యం ఏర్పరచుకున్న అనంతరం గల్ఫ్ ప్రాంతంలో పూర్తిగా ఆటోమేటెడ్ ఆన్లైన్ ఇన్స్టాల్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థగా ఇతిహాద్ పేరులోకి వచ్చింది. అరబ్ వరల్డ్‌లో పేపోర్టు, దిగ్గజ పేమెంట్ సర్వీసు ప్రొవైడర్. ఈ స్కీమ్‌ను పొందడం కోసం ప్రయాణికులు ఇతిహాద్ విమానయాన సంస్థ వెబ్సైట్లో 'పే బై ఇన్స్టాల్మెంట్' ఆప్షన్‌ను ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం తమ దగ్గర క్రెడిట్ కార్డుంటే బ్యాంకును ఎంపికచేసుకుని, చెల్లింపు కాలాన్ని నమోదుచేయాలి. మూడు నెలల నుంచి 60 నెలల వరకు చెల్లింపు వాయిదాలను ఎంచుకోవచ్చు. 17 బ్యాంకుల కస్టమర్లకు అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రయాణం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తమకు తెలుసని, ముఖ్యంగా కుటుంబసభ్యులకు ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని ఎయిర్‌లైన్ డిజిటల్ స్ట్రాటజీ, ఇన్నోవేసన్ వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ వార్బై చెప్పారు. ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించే దిగులు అవసరం లేకుండా.. ప్రయాణాన్ని ఎంజాయ్ చేయడానికి ఇదొక గొప్ప మార్గమని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ను డిజైన్ చేసేముందు తక్కువ, మధ్య తరగతి ప్రయాణికులను, కుటుంబ సభ్యులను పరిగణలోకి తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ స్కీమ్ యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







