ఆమెరికాలోని లాస్ వేగాస్ లో కాల్పులు.. ఇద్దరు మృతి, 11మంది పరిస్థితి విషమం
- October 02, 2017
ఆమెరికాలోని లాస్ వేగాస్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. మాండలై బే హోటల్లో జరుగుతున్న ది రూట్ 91 హర్వెస్ట్ కంట్రీ మూజిక్ ఈవెంట్ లోకి చొరబడిన ఓ అగంతకులు... విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో ఇద్దరు మరణించారు. 24మంది గాయపడ్డారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం చేటుచేసుకుంది. జనం ప్రాణభయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సంఘటనా స్థలాన్ని తమ అదుపులోకి తీసుకొని క్షతగాత్రులకు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసుల కాల్పుల్లో ఓ అనుమానితుడు మరణించాడు. మరో అగంతకుడి కోసం గాలిస్తున్నారు.
గాయపడిన వారిలో 11మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని దగ్గరలోని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పట్టుకునేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇద్దరు దుండగులు హోటల్ 32వ అంతస్థులోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాలను రద్దుచేసి, భద్రతను కట్టుదిట్టంచేశారు. కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతంలో భయాన వాతావరణం నెలకొంది.
అమెరికాలో చోటుచేసుకుంటున్న వరుస తుపాకి కాల్పులతో జనం ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఎలాంటి దాడులు జరుగుతాయోనని ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడు.. ఇంకా అదే ప్రాంతంలో తిరుగుతుండడం కలకలం సృష్టిస్తోంది. అతడు ఎప్పుడు ఎవరిపై కాల్పులు జరుపుతాడో అన్న భయంతో స్థానికులు వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









